రౌడీ షీటర్లకు ఎస్పీ వార్నింగ్

6చూసినవారు
కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ నేతృత్వంలో మంగళవారం అర్ధరాత్రి కడపలోని ఆలంఖాన్ పల్లి, అల్మాస్ పేట ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 30 వాహనాలు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలుంటాయని, రౌడీయిజానికి పాల్పడితే జిల్లా బహిష్కరణ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. గంజాయి బ్యాచ్ లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్