గండికోట ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈనెల 11, 12, 13న ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు RTC రీజనల్ మేనేజర్ గోపాల్‌రెడ్డి శనివారం తెలిపారు. జమ్మలమడుగు, కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు డిపోల నుంచి మొత్తం 39 బస్సులను నడుపుతున్నామన్నారు. జమ్మలమడుగు నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి 10 వరకు బస్సులు తిరుగుతాయన్నారు. ఈ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు.