రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు: సీపీఐ ఎంఎల్

4చూసినవారు
రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు: సీపీఐ ఎంఎల్
రాయలసీమ జిల్లాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల ఓబయ్య పిలుపునిచ్చారు. డిసెంబర్ 6, 7 తేదీలలో జరిగే 9వ రాష్ట్ర మహాసభలు ఈ అభివృద్ధికి వేదిక కానున్నాయని, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలైనా కడపకు, రాయలసీమకు ఒరిగిందేమీ లేదని ఆయన ప్రశ్నించారు. ఈ మహాసభలకు జాతీయ ప్రధాన కార్యదర్శి దింపాకర్ భట్టాచార్య, పార్లమెంట్ సభ్యులు సుధామ ప్రసాద్ హాజరవుతారని తెలిపారు.