కడపలోని శ్రీ విజయదుర్గమ్మ సన్నిధిలో భక్తుల కోరికలు తీర్చే రాహుకాల పూజలు మంగళవారం ఘనంగా జరిగాయి. అమ్మవారికి అభిషేకం, పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం రాహుకాల సమయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. జాతక దోషాలున్న వారు 11, 21, 41 వారాలు దీపాలు వెలిగిస్తే ఇబ్బందులు తొలగుతాయని వ్యవస్థాపకులు మల్లికార్జున రావు తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని కటాక్షాలు పొందాలని నిర్వాహకులు ప్రసాద్, అర్చకులు సూచించారు.