కార్తీక మాసం సందర్భంగా, కడప డిపో మేనేజర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం కడప ఓల్డ్ బస్టాండ్ నుంచి నిత్యపూజకోన, పొలతలకి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. పొలతలకి 6:30, 9:00, 11:30, 14:15, 16:45 గంటలకు, నిత్యపూజకోనకి 6:30, 9:30, 12:30, 15:30 గంటలకు బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. భక్తులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.