రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపిన వివరాల ప్రకారం, బీహార్‌లోని ఛప్రాకు కడప మీదుగా ప్రత్యేక రైలు నడుస్తుంది. రైలు నెంబర్ 07443 7వ తేదీ రాత్రి 11. 55కు తిరుపతిలో బయలుదేరి రాజంపేట, కడప మీదుగా 10న ఛప్రా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 07444 12వ తేదీ ఉదయం 5 గంటలకు ఛప్రాలో బయలుదేరి 14న ఉదయం కడప, తిరుపతి చేరుకుంటుంది.