వై.ఎస్.ఆర్ కడప జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, గురువారం అర్ధరాత్రి దాటాక ప్రయాణించే లారీ, బస్సు, కార్ల డ్రైవర్లను ఆపి, వారి ముఖాలను నీళ్లతో కడిగిస్తున్నారు. నిద్రమత్తును వదిలించుకుని, కుటుంబ సభ్యులను గుర్తుచేసుకుని అప్రమత్తంగా వాహనాలు నడపాలని డ్రైవర్లకు సూచిస్తున్నారు.