కడప గౌస్ నగర్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో జరిగిన బడి పండుగలో అధికారులు,
విద్యార్థులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఏపీసీ బి. అనురాధ మాట్లాడుతూ, డిజిటల్ తరగతులు, అర్హులైన ఉపాధ్యాయులు, స్మార్ట్ కిచెన్ ద్వారా మెరుగైన భోజనంతో ప్రభుత్వ బడులు బలోపేతం అయ్యాయని తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ బడులనే ఎంచుకోవాలని డిప్యూటీ డీఈవో సూచించారు. బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.