కడప ద్వారకా నగర్‌లో ఆదివారం వైయస్సార్ జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో రామ ముని రెడ్డి రచించిన ‘నా స్మృతి పథంలో’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ, ధార్మిక, నిస్వార్థ ప్రజాసేవకుడిగా రామ ముని రెడ్డి సేవలు అమోఘమని కొనియాడారు. పలువురు అతిథులు ఆయన జీవితం యువతకు ఆదర్శమని ప్రశంసించారు.