కడప జిల్లాలో 17 వేల ఎకరాల్లో ఉల్లి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం హెక్టార్‌కు రూ. 50 వేల ఆర్థిక సహాయం అందించాలని కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ ను కోరారు. సహాయం అందకపోతే రైతులతో కలిసి నిరసనలు చేస్తామని ఆయన హెచ్చరించారు.