సిద్ధవటం మండలంలోని నిత్యపూజ స్వామి కోనలో శివరాత్రి మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని SI హారిక తెలిపారు. భక్తులు వాహనాల వల్ల ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామని, పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని ఆమె కోరారు.