కడపలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుర్రాలగడ్డ వీధికి చెందిన సయ్యద్ (10) అనే బాలుడు స్నేహితులతో కలిసి బుగ్గవంక పరివాహక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న షామీరియా బ్రిడ్జి కింద ఉన్న నీటి గుంతల వద్ద చేపలు పట్టేందుకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయిన బాలుడిని వెంటనే బయటకు తీసి రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.