కడప శివారులోని వైఎం ఎంటర్ప్రైజెస్ వద్ద స్క్రాప్ దహనం చేస్తున్న సమయంలో టీన్నర్ బాటిల్ పేలి మొఘల్ అలీమా బెగ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించినా, కర్నూలులో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.