కడప నగరం రిమ్స్ ఆసుపత్రి సమీపంలో సోమవారం రాత్రి సుమారు 70 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందింది. ఆమె ఎరుపు రంగు నైటీ ధరించి ఉందని రిమ్స్ పోలీసులు తెలిపారు. ఈ వృద్ధురాలి గురించి మరిన్ని వివరాలు తెలిసినవారు 91211 00524 నంబరులో సంప్రదించాలని పోలీసులు కోరారు.