వడ్డే ఓబన్న జయంతి: స్ఫూర్తిదాయకం ఆయన పోరాటం - కడప పోలీసులు

2చూసినవారు
వడ్డే ఓబన్న జయంతి: స్ఫూర్తిదాయకం ఆయన పోరాటం - కడప పోలీసులు
కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో, ఏఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య ఓబన్న చిత్రపటానికి నివాళులర్పించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి బ్రిటిష్ సైన్యంపై ఓబన్న చేసిన వీరోచిత పోరాటం తెలుగుజాతికి గర్వకారణమని, ఆయన జీవితం అందరికీ ఆదర్శమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్