
జల్సా సినిమా చూసేందుకు వచ్చిన మహేశ్ అభిమానిపై దాడి
పవన్ కల్యాణ్ నటించిన 'జల్సా' సినిమా 4కే వెర్షన్ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహేశ్ బాబు అభిమానిపై పవన్ అభిమానులు దాడికి పాల్పడ్డారు. 'నువ్వు ఏ హీరో అభిమానివి.. మహేశ్ బాబు మబ్బు స్టార్ అను' అంటూ థియేటర్లో అందరి ముందే దాడి చేయడంతో ప్రేక్షకులు భయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటన ఎక్కడ జరిగిందో తెలియకపోయినా, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




