కడపలో జలమయమైన రోడ్లు.. రంగంలోకి దిగిన అడిషనల్ కమిషనర్

2చూసినవారు
కడప నగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా ఎన్జీవో కాలనీలోని పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. ఈ సమాచారం అందుకున్న కడప మున్సిపల్ అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర వెంటనే క్షేత్రస్థాయి పర్యటన చేశారు. అధికారులతో కలిసి డ్రైనేజీల్లో అడ్డంకులను తొలగించి, మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపే పనులను వేగవంతం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వర్షాకాలంలో అత్యవసర సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్