కడప పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్పీ కేక్ కట్ చేసి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 నాటికి ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని, విధుల్లో ఉన్న పోలీసులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.