బద్వేలు పట్టణంలో డిసెంబర్ 07, 2025న జరగాల్సిన ప్రపంచ వికలాంగుల దినోత్సవ సదస్సు అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. దివ్యాంగుల పోరాట సమితి కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. బద్వేలు పట్టణం సిద్ధవటం రోడ్డులోని మార్కెట్ యార్డులో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు తెలిపారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.