హైదరాబాద్‌లోని మియాపూర్ ఠాణా పరిధిలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్ అబ్దుల్ రహమాన్ (33) అనే యువ ఇంజినీర్ మృతి చెందారు. కడప జిల్లాకు చెందిన రహమాన్, వాణి నగర్‌లో నివసిస్తూ నల్లగండ్ల సమీపంలోని నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నారు. కార్యాలయం నుంచి ద్విచక్ర వాహనంపై మియాపూర్ వైపు వెళ్తుండగా మక్తా గ్రామం వద్ద అదుపుతప్పి కింద పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.