ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ఎర్రగుంట్ల మెయిన్ బజార్‌లో ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలను శుక్రవారం స్థానిక యువకులు పూడ్చివేశారు. ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తామే ఈ చర్య తీసుకున్నట్లు యువకులు తెలిపారు. ఇకనైనా అధికారులు రోడ్లపై గుంతలు లేకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.