భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు దేశ సమైక్యత, సంస్కృతి, విలువలను కాపాడటం విద్యార్థుల బాధ్యత అని అన్నారు. శనివారం యోగివేమన విశ్వవిద్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమంలో పాల్గొని, యువత దేశాభివృద్ధికి కీలక పాత్ర వహించాలని, సంస్కృతిని పరిరక్షించి, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్, వైసీయూ వీసీ రాజశేఖర్, రిజిస్ట్రార్ పద్మ, ప్రొఫెసర్లు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.