ప్రభుత్వ వైఫల్యాలపై 12న కడపలో వైసీపీ నిరసనలు

0చూసినవారు
ప్రభుత్వ వైఫల్యాలపై 12న కడపలో వైసీపీ నిరసనలు
కడపలో ఎమ్మెల్సీ రామచంద్రరెడ్డి, ఇతర నాయకులు ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ అనే పోస్టర్‌ను విడుదల చేశారు. రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువులు అందుబాటులో లేక రైతులు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు తెలిపారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా 12వ తేదీన నిర్వహించే ఆందోళనలో ప్రజలు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.