వైఎస్సార్ కడపలోని వైవియులో
విద్యార్థులు నిర్వహించిన బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థి గళంపై పోలీసులు ఉక్కుపాదం మోపారని, సమస్యలు పరిష్కరించాలని కోరితే అక్రమ అరెస్టులు చేస్తున్నారని
విద్యార్థులు ఆరోపించారు. ముందస్తుగా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. క్యాంపస్‌లో భారీగా పోలీసులను మోహరించి బంద్‌ను అడ్డుకున్నారు. వైవియులో వైఫై, కంప్యూటర్స్, మెస్ సమస్యలతో పాటు, మెస్‌లో అవినీతి, అధిక ఫీజులపై కూడా ఆరోపణలు వినిపించాయి. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని
విద్యార్థులు డిమాండ్ చేశారు.