యోగి వేమన విశ్వవిద్యాలయం బోటనీ స్కాలర్ వి. జె. శైలజ రాణికి 'నల్లమల అడవిలోని అలంకార మొక్కలు' అనే అంశంపై పరిశోధనకు గాను డాక్టరేట్ లభించింది. ఆచార్య ఎం. మధుసూదనరెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ పరిశోధనలో గృహాలంకరణకు పనికొచ్చే 422 రకాల మొక్కలను ఆమె గుర్తించారు. ప్రస్తుతం నంద్యాల డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న శైలజ రాణికి ఈ గౌరవం దక్కింది. ఈ విషయాన్ని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కృష్ణారావు శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా తెలిపారు.