కడప నగరంలో అభివృద్ధి శూన్యం: సీపీఎం విమర్శ

4చూసినవారు
నవంబర్ 17 నాటికి కడప నగర పాలక సంస్థ ఏర్పడి 21 సంవత్సరాలు పూర్తయినా, పంచాయతీల నుండి విలీనమైన డివిజన్లలో అభివృద్ధి లేదని సీపీఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ విమర్శించారు. బుధవారం కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాన కూడళ్లలో తప్ప ఇతర ప్రాంతాల్లో రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్ స్తంభాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్పొరేషన్కు పన్నులు చెల్లిస్తున్నా అభివృద్ధి శూన్యమని, వర్షాకాలంలో మురుగునీరు రోడ్లపై ప్రవహించి ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారని అన్నారు. దీనికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ, నవంబర్ 17న కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్