
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థిని ఎంపిక
శనివారం కడప మున్సిపల్ ఉర్దూ హైస్కూల్లో జరిగిన జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 ఖోఖో పోటీలలో వల్లూరు ఏపీ మోడల్ కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థిని జి. మోక్షిత ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు విద్యార్థినిని అభినందించారు.




































