కడపలో AIBE మోడల్ పరీక్ష నిర్వహణ

851చూసినవారు
కడపలో AIBE మోడల్ పరీక్ష నిర్వహణ
IAL ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో, వైఎస్సార్‌ కడపలో ఈరోజు S.B.T.R.M లా కాలేజ్, మన్‌సూర్ లా అకాడమీ భాగస్వామ్యంతో AIBE మోడల్ పరీక్ష నిర్వహించారు. రిటైర్డ్ న్యాయమూర్తి షేక్ మహమ్మద్ ఇస్మాయిల్, S.B.T.R.M లా కళాశాల ప్రిన్సిపాల్ షేక్ జహీరుద్దీన్, మన్‌సూర్ లా అకాడమీ వ్యవస్థాపకులు షేక్ మన్‌సూర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులకు విలువైన సూచనలు, పరీక్షా వ్యూహాలు, విజయానికి మార్గదర్శకాలు అందించారు. AIBE ఓపెన్ బుక్ పరీక్ష విధానంపై అవగాహన కల్పించి, పరీక్షా నమూనాను ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం కల్పించారు.

సంబంధిత పోస్ట్