వైవియూ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-4 సదస్సులో నాకో కన్సల్టెంట్ ఇంతియాజ్ అహ్మద్, ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనతో సమాజాన్ని చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపరాదని డాక్టర్ సునీత, సరిత, లాజర్ పేర్కొన్నారు. మరోవైపు, యూనిట్-9 పీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శివాజీనగర్‌లో విద్యార్థులు పోస్టర్లతో ర్యాలీ నిర్వహించి, ప్రజలకు వ్యాధిపై అవగాహన కల్పించారు.