కమలాపురంలో అంగన్వాడీల ఆందోళన: మాట తప్పిన ప్రభుత్వంపై ఆగ్రహం

6చూసినవారు
కమలాపురంలో అంగన్వాడీల ఆందోళన: మాట తప్పిన ప్రభుత్వంపై ఆగ్రహం
విజయవాడలో అంగన్వాడీల అరెస్టుకు నిరసనగా కమలాపురంలో మంగళవారం రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మూడు రోడ్ల కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్దతుగా నిలిచిన కూటమి నేతలు, అధికారంలోకి వచ్చాక మాట మార్చడంపై వారు మండిపడ్డారు. న్యాయమైన కోరికలు తీర్చేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేత నాగేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్