బుగ్గవంక వద్ద విపత్తుల నివారణకు బెటాలియన్ సిద్ధం

6చూసినవారు
చింతకొమ్మదిన్నె మండలంలోని బుగ్గవంక ప్రాజెక్టు వద్ద ఎలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఐ బాల మద్దిలేటి ఆదివారం రాత్రి వెల్లడించారు. విజయవాడ నుంచి 30 మంది సభ్యులతో కూడిన 10వ బెటాలియన్ పోలీసు బృందం ప్రత్యేకంగా తరలివచ్చింది. వరదలు లేదా ఇతర ప్రమాదాల సమయంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టడానికి ఈ బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్