కమలాపురంలో బైక్ చోరీ.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి

4చూసినవారు
కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని క్రాస్ రోడ్డులో ఉన్న మద్యం దుకాణం వద్ద AP04 AR 2994 నంబర్ గల యూనికార్న్ బైక్ చోరీకి గురైంది. పసుపు రంగు చొక్కా ధరించిన వ్యక్తి బైక్‌ను తీసుకెళ్లినట్లు గుర్తించారు. సదరు వ్యక్తిని లేదా వాహనాన్ని గుర్తించినవారు వెంటనే కమలాపురం పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సిఐ: 91211 00529, ఎస్ఐ: 91211 00532 నెంబర్లలో సంప్రదించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్