బీజేపీ నాయకులు సీఐ చాంద్ భాషాను మర్యాదపూర్వకంగా కలిశారు

2151చూసినవారు
బీజేపీ నాయకులు సీఐ చాంద్ భాషాను మర్యాదపూర్వకంగా కలిశారు
వైఎస్సార్‌ కడప జిల్లా చెన్నూరు మండలంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎస్.కె. చాంద్ భాషాను భారతీయ జనతా పార్టీ నాయకులు 2026 ఏప్రిల్ 26న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసి, చెన్నూరు మండలంలో చట్టం-శాంతి పరిరక్షణలో సమర్థవంతంగా సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కడప జిల్లా సెక్రటరీ టి.ఏ. భరత్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి గోవిందు గణేష్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దొమ్మర శ్రీనివాసులు, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు ఆది వెంకటసుబ్బయ్య, కిసాన్ మోర్చా జిల్లా ఎగ్జిట్ నెంబర్ ఇట్టిం శివరం యాదవ్, సెక్రెటరీ ఎం. రమేష్ రెడ్డి పాల్గొన్నారు.