చెన్నూరు: జర్నలిస్టుల రక్షణకు చట్టం తేవాలి

2544చూసినవారు
విలేకరి జగన్ హత్యకు నిరసనగా చెన్నూరులో గురువారం జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలతో బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి సీఐ చాంద్ బాషాకు వినతిపత్రం ఇచ్చారు. సాలూరులో పాత్రికేయులపై దాడులను ఖండించారు. ప్రజా సమస్యలపై పోరాడే వారిని హత్య చేయడం దారుణమని, బాధిత కుటుంబాన్ని ఆదుకొని, నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్