చెన్నూరు: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి

3చూసినవారు
చెన్నూరు: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి
నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మంగళవారం చెన్నూరు పోలీసు స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు, నేరచరిత్ర గలవారికి చెన్నూరు సి. ఐ కృష్ణారెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సి. ఐ కృష్ణారెడ్డి హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్