వల్లూరు జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలోని ఒక భవనంలో పై అంతస్తు తరగతి గదికి వెళ్లే మెట్లు విద్యార్థులకు ప్రమాదకరంగా మారాయి. మెట్లకు సరైన రక్షణ కంచె (రైలింగ్) లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చని వారు భయపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, మెట్లకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.