ప్రాణాలు నిలిపిన డయల్ 112.. 10 నిమిషాల్లో పోలీసుల రెస్క్యూ

0చూసినవారు
ప్రాణాలు నిలిపిన డయల్ 112.. 10 నిమిషాల్లో పోలీసుల రెస్క్యూ
భర్త వేధింపుల కారణంగా ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి మంగళవారం కడప రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించింది. డయల్ 112కు అందిన సమాచారంతో పోలీసులు వెంటనే స్పందించి, బ్లూ కోల్ట్స్ సిబ్బంది ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఆమె స్థానాన్ని గుర్తించారు. కేవలం పది నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకుని తల్లీ, పిల్లలను సురక్షితంగా రక్షించారు. సకాలంలో స్పందించి నలుగురి ప్రాణాలను కాపాడిన పోలీసులను కడప ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్