పరిశుభ్రతతో వ్యాధులను నివారించవచ్చు

3చూసినవారు
పరిశుభ్రతతో వ్యాధులను నివారించవచ్చు
చెన్నూరు పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నివాస పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. శుక్రవారం డ్రైడే ఫ్రైడే సందర్భంగా చెన్నూరు సచివాలయం - 3 పరిధిలో ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. నివాస స్థలాలలో నీరు నిలువ లేకుండా చూసుకోవాలని, ఒకవేళ నిలువ ఉంటే రెండు చుక్కలు కిరోసిన్ లేదా ఆయిల్ వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటసుబ్బయ్య, హెల్త్ సూపర్వైజర్ సుబ్బరామయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్