కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు మంగళవారం కమలాపురం పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతిని సిబ్బందిని అడిగి తెలుసుకున్న ఆయన, కేసులు పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. సీఐ రోషన్, ఎస్సై విద్యాసాగర్ కేసుల వివరాలు వివరించగా డీఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు.