నేను బతికే ఉన్నా.. ఆధార్‌లో చంపేశారు!

1606చూసినవారు
కమలాపురం మండలం చదిపిరాల గ్రామానికి చెందిన మొటిమర చిన్న గంగన్న, తన ఆధార్ కార్డులో చనిపోయినట్లు నమోదు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ పనిచేయకపోవడంతో, దాన్ని సరిచేయడానికి అధికారులు హైదరాబాద్, ఢిల్లీ వెళ్లాలని చెబుతున్నారని ఆయన వాపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని, ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని గంగన్న వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్