కమలాపురం మాజీ ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేశారని న్యాయస్థానం నుంచి పలువురికి నోటీసులు అందాయి. ఈ నోటీసుల్లో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేశ్ రెడ్డి, బాలిశెట్టి హరి ప్రసాద్, గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిలతోపాటు పలు మీడియా సంస్థలకు కూడా నోటీసులు జారీ అయ్యాయని వైసీపీ నాయకులు తెలిపారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.