మంగళవారం వీరపునాయునిపల్లి మండలం అనిమల ఆర్బీకేలో ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి 40 శాతం రాయితీతో వేరుశనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. పంటలకు బీమా రక్షణ కవచం వంటిదని, ఆధునిక సాంకేతికత, ప్రకృతి వ్యవసాయంతో లాభాలు పొందాలని ఆయన సూచించారు. ప్రకృతి సాగుతో భూమి సారవంతమై అధిక దిగుబడులు వస్తాయని ఏవో నరసింహారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, కార్యకర్తలు, మహిళలు, అధికారులు పాల్గొన్నారు.