కమలాపురం మండలంలోని టీ. చదిపిరాళ్ల గ్రామంలో 'ఒక నెల-ఒక గ్రామం-నాలుగు సందర్శనలు' కార్యక్రమం గురువారం జరిగింది. కడప ఆర్డీవో మురళి, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో స్థానిక రైతులు, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించిన అధికారులు, ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.