కమలాపురం: వైసీపీ నేత రాజశేఖర్‌రెడ్డిపై కత్తితో దాడి

4చూసినవారు
కమలాపురం జెడ్పీటీసీ భర్త, వైసీపీ నేత తురకపల్లి రాజశేఖర్‌రెడ్డిపై శనివారం రాత్రి తురకపల్లిలో దారుణ దాడి జరిగింది. ఆరుబయట ఫోన్ లో మాట్లాడుతుండగా దుండగుడు కత్తితో పదికి పైగా పొడిచి పారిపోయాడు. రక్తస్రావంతో స్పృహ కోల్పోయిన ఆయనను ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. స్థానికుడైన సునీల్ పై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్