కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని క్రాస్‌రోడ్డు వద్ద కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై ఒక ప్రైవేట్ అంబులెన్స్‌లోకి ఇనుప కడ్డీలు దూసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. కడప నుంచి ఎర్రగుంట్ల వైపు వెళ్తున్న అంబులెన్స్‌లోకి, ఎదురుగా వస్తున్న లారీ నుంచి కడ్డీలు దూసుకువచ్చాయి. అప్రమత్తమైన స్థానికులు కేకలు వేయడంతో వాహనాలు ఆపివేయడంతో అంబులెన్స్‌లోని రోగులు సురక్షితంగా బయటపడ్డారు.