ఆర్&బీ అధికారుల నిర్లక్ష్యం.. యువత సామాజిక స్పృహ

6చూసినవారు
ఆర్&బీ అధికారుల నిర్లక్ష్యం.. యువత సామాజిక స్పృహ
పెండ్లిమర్రి మండలం వేంపల్లి-మిట్టమీదపల్లి రహదారిలో స్పీడ్ బ్రేకర్లకు జీబ్రా లైన్లు వేయడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఇటీవల ఇందిరానగర్ వద్ద స్పీడ్ బ్రేకర్ కనిపించక ఒక వాహనం ఢీకొని ట్రాన్స్ జెండర్ మృతి చెందారు. ఈ ఘటన జరిగి రోజులైనా ఆర్&బీ అధికారులు స్పందించకపోవడంతో, స్థానిక యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రమాదాలు జరగకుండా జీబ్రా పెయింట్స్ వేశారు. యువత చేసిన ఈ మంచి పనికి స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్