కమలాపురం మండలం సి. గోపులాపురం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద నీరు చేరడంతో వారం రోజులుగా విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జిలో నిలిచిన నీటిలో నిరసన తెలిపిన గ్రామస్తులు, రెండు రైల్వే ట్రాక్‌లు దాటి వెళ్లాల్సిన దుస్థితిని వివరించారు. ప్రమాద భయంతో ఉన్న గ్రామస్తులు, నీటిని తొలగించి దారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.