చింతకొమ్మదిన్నె మండలం ప్రకాశంపల్లిలోని క్రీస్తు మా మంచి కాపరి దేవాలయంలో కడప మేత్రాసనం అధికారి పౌలు ప్రకాష్ దివ్య బలి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పునీత అంథోని ఏసుప్రభు పేరిట చేసిన అద్భుతాలు, వేద సత్యాలను వివరించారు. తోటివారి మంచి కోరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పూజలో ఫాదర్ ఎండి ప్రసాద్, క్రీస్తు జ్యోతి కన్య స్త్రీలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.