మంగళవారం కమలాపురంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రోషన్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, వాహన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై విద్యాసాగర్ కూడా పాల్గొన్నారు.