ఆటో - ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు

8చూసినవారు
ఆటో - ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు
వల్లూరు మండలం గోటూరు టోల్ గేట్ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పుల్లారెడ్డిపేట ఎస్సీ కాలనీకి చెందిన సుబ్బరాయుడు నడుపుతున్న ఆటో, కమలాపురం వైపు వస్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స కోసం కడపకు తరలించారు. ద్విచక్ర వాహనదారుని వివరాలు, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :